Banned Items In Flights: ఇవి తీసుకువెళ్తే ప్రమాదమే
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:38 AM
నవ్య నాయర్ అనే మలయాళ నటి మల్లెపూల మాల తీసుకెళ్లినందుకుగాను మెల్‌బోర్న్ విమానాశ్రయంలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కొన్ని వస్తువులు...
నవ్య నాయర్ అనే మలయాళ నటి మల్లెపూల మాల తీసుకెళ్లినందుకుగాను మెల్‌బోర్న్ విమానాశ్రయంలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కొన్ని వస్తువులు మనకు చాలా సాధారణమైనవే అయినప్పటికీ విదేశీ నిబంధనల ప్రకారం నిషేఽధించినవి కావచ్చు. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు వేటిని తీసుకెళ్లకూడదనే అంశంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో బయోసెక్యూరిటీ-కస్టమ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పర్యావరణ వ్యవస్థను కాపాడడానికి ఆ దేశం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. బయటి దేశాల నుంచి పూలు, మొక్కలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, వండిన ఆహారం, బియ్యం, టీ, తేనె, పక్షుల ఈకలు, బ్యాగులు, దుప్పట్లు తీసుకురావడాన్ని నేరంగా పరిగణిస్తారు. వీటివల్ల వాతావరణ కాలుష్యం, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం.
దక్షిణ కొరియాకు గసగసాలు తీసుకెళ్లకూడదు. గసగసాలు ఎక్కువగా ఉండే అమెరికన్ మసాలా ‘ఎవ్రీథింగ్ బట్ ది బాగెల్’కు కూడా అనుమతి లేదు.
ఘాటైన వాసనను వెదజల్లుతూ పనస పండులా కనిపించే డురియన్ పండును చాలా దేశాలు అనుమతించవు.
సింగపూర్‌కు చూయింగ్ గమ్‌ను తీసుకెళ్లకూడదు. నికొటిన్ లాంటి వైద్యపరమైన వాటిని మాత్రమే అనుమతిస్తారు. చూయింగ్ గమ్‌లను నమలడం, బహిరంగంగా ఉమ్మివేయడం చేస్తే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది.
కరేబియన్ దీవులకు ముసుగులు, మభ్యపెట్టే దుస్తులు తీసుకెళ్లకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..