Share News

Baby Bathing and Oil Massage: స్నానం దివ్య ఔషథం

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:22 AM

పసికందుల స్నానం విషయంలో తల్లులకు ఎన్నో అపోహలుంటాయి. నూనె మర్దన మొదలు, స్నానం చేయించే తీరు గురించి పలువురు పలు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు...

Baby Bathing and Oil Massage: స్నానం దివ్య ఔషథం

ఛైల్డ్‌ కేర్‌

పసికందుల స్నానం విషయంలో తల్లులకు ఎన్నో అపోహలుంటాయి. నూనె మర్దన మొదలు, స్నానం చేయించే తీరు గురించి పలువురు పలు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో వైద్యుల సలహాలను పాటించడం శ్రేయస్కరం.

స్పర్శతో తల్లికీ, బిడ్డకూ మధ్య అనుబంధం బలపడుతుంది. కాబట్టి అర్థం లేని భయాలు, అనుమానాలతో తల్లులు పసికందులకు స్నానం చేయించడానికి వెనకాడకూడదు. నూనె మర్దనతో బిడ్డల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గి, బరువు పెరుగుతారు. కంటి నిండా నిద్రపోతారు. కాబట్టి తప్పనిసరిగా పసికందులకు నూనెతో మర్దన చేయాలి. అందుకోసం....

  • చదునైన, సౌకర్యవంతమైన ప్రదేశంలో బిడ్డను పడుకోబెట్టి, తాజా కొబ్బరినూనెతో మర్దన మొదలుపెట్టాలి. ఆవనూనె, సోయాబీన్‌ నూనెలు మర్దనకు పనికిరావు

  • సున్నితంగా, మృదువుగా తల నుంచి పాదాల వరకూ మర్దన చేయాలి

  • మర్దన మొరటుగా కాకుండా సున్నితంగా సాగాలి

  • 15 నుంచి 30 నిమిషాల లోపు మర్దన ముగించాలి

  • ముఖం మీదా, నోటి చుట్టూరా వేళ్లతో వృత్తాకారంలో మర్దన చేయాలి

  • భుజాల నుంచి ఛాతీ వరకూ పైనుంచి కిందకు మర్దన చేయాలి. అరచేతులు, వేళ్లను కూడా మర్దన చేయాలి

  • కడుపు మీద కుడి నుంచి ఎడమకు సవ్య దిశలో మర్దన సాగాలి

మర్దన ఎప్పుడు?

  • ఫ పాలు తాగిన గంట తర్వాత మొదలుపెట్టాలి

  • ఫ చేతులకు గోళ్లు, ఆభరణాలు ఉండకూడదు

  • ఫ వేసవిలో స్నానానికి ముందు, చలికాలంలో స్నానం తర్వాత మర్దన కొనసాగాలి

  • ఫ మౌనంగా కాకుండా బిడ్డతో కబుర్లు చెబుతూ, ఆడిస్తూ మర్దన కొనసాగించాలి

కూడని పనులు

  • ఫ ముక్కు, చెవుల్లో, బొడ్డులో నూనె పోయకూడదు

  • ఫ రొమ్ములను పిండకూడదు

  • ఫ బిడ్డ నలతగా ఉన్నప్పుడు మర్దన చేయకూడదు

స్నానం ఇలా...

  • తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు, బొడ్డు ఊడని పిల్లలకు వైద్యులు సూచించనిదే స్నానం చేయించకూడదు

  • చలికాలంలో వారానికి రెండు లేదా మూడు స్నానాలు సరిపోతాయి

  • నీటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మించకూడదు

  • స్వల్ప ఆమ్ల పిహెచ్‌ కలిగిన సబ్బును ఎంచుకోవాలి. సబ్బు తక్కువ సువాసన కలిగి ఉండాలి

  • స్నానం తదనంతరం తువ్వాలుతో సున్నితంగా తుడవాలి. దురుసుగా వ్యవహరించకూడదు

  • ముడతల్లో, బాహుమూలల్లో, తడి నిలిచిఉండే ప్రదేశాలన్నీ పొడిగా తుడిచి, పొడి దుస్తులు తొడగాలి.

డాక్టర్‌ రవళి వోగేలి,

కన్సల్టెంట్‌ నియోనాటాలజిస్ట్‌,

ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 01:22 AM