Share News

Eleven Rudra Powers: ఏకాదశ రుద్రశక్తులు

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:54 AM

మహా విష్ణువు దశావతారాల్లో కల్కి అవతారం ఆఖరిది అనీ, సదాశివుడి పదకొండు రుద్ర శక్తులతోనే ఈ కల్కి అవతారం రాబోతున్నదనీ, ఆ అవతారమే దుష్ట శక్తులను, దైవ వ్యతిరేక కార్యాలు చేసేవారని సంహరిస్తుందనీ ప్రాచీన పురాణ గ్రంథాలు...

Eleven Rudra Powers: ఏకాదశ రుద్రశక్తులు

సహజయోగ

మహా విష్ణువు దశావతారాల్లో కల్కి అవతారం ఆఖరిది అనీ, సదాశివుడి పదకొండు రుద్ర శక్తులతోనే ఈ కల్కి అవతారం రాబోతున్నదనీ, ఆ అవతారమే దుష్ట శక్తులను, దైవ వ్యతిరేక కార్యాలు చేసేవారని సంహరిస్తుందనీ ప్రాచీన పురాణ గ్రంథాలు వివరించాయి. భౌతిక స్థాయిలో ఆ ఏకాదశ రుద్రశక్తులు మన అంతర్గత సూక్ష్మ నాడీ వ్యవస్థలో... నుదుటి మధ్య భాగంలో ఉన్న ఆజ్ఞా చక్రం పైభాగంలో స్థిరపడి ఉంటాయి. సృష్టి పరిణామ క్రమంలో మానవుల నుదుటి భాగం సృష్టి అంత సులువుగా జరగలేదు. ఎంతో ప్రత్యేకమైన, సుదీర్ఘమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా ఇది సంభవించింది. దీనిలో ఎంతో లోతైన అంతరార్థం ఉంది.

ప్రకృతిలో కాలానుగుణంగా అన్నీ సరైన రీతిలో సక్రమంగా జరుగుతాయి. ఇదంతా అందంగా జరిగే నిరంతర ప్రక్రియ. కానీ మనిషి అనాలోచితమైన మూర్ఖ విధానాలతో ప్రకృతికి భంగం కలుగుతుంది. ప్రకృతిని నాశనం చేసే దుష్ట శక్తులను ఏకాదశ రుద్రులు నాశనం చేస్తారు. ప్రస్తుత కాలంలో మానవులు భ్రాంతి, భ్రమలకు లోనై జీవిస్తున్నారు. కార్యాచరణలో విఫలమైనప్పుడు... తమకంటే ఇతరులు గొప్పగా ఉన్నారని భావిస్తారు. వేరొకరితో పోల్చుకొని, వారితో సరితూగలేకపోతున్నామనే వ్యధ, అసూయ, కోపోద్రేకాల వల్ల నిగ్రహం కోల్పోతారు. ఆ స్వభావం పెరిగి పెద్దదై... భగవత్‌ వ్యతిరేక శక్తిగా మారుతుంది. ఇలాంటి శక్తులు బలపడి, మానవులకు అర్థంకాని రీతిలో చాలా సూక్ష్మంగా పని చేస్తాయి. వైర్‌సలా అనుక్షణం వినాశనం సాగిస్తూ ఉంటాయి. మరి మనం ఏం చేయ్యాలి? ఆత్మ సాక్షాత్కారం ద్వారా దైవికంగా పొందిన చైతన్య తరంగాలతో ప్రకృతిని మీరు రక్షించగలరు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మనలోనే ఉన్న ఏకాదశ రుద్రశక్తులు ఎలా పనిచేస్తాయనేది తెలుస్తుంది. కానీ ఈ శక్తిని మనలో పెంపొందించుకోవడానికి ముందు... మనం నిర్మాణాత్మక స్థితివైపు వెళ్తున్నామా? లేక వినాశనం వైపు వెళ్తున్నామా? అనే విషయాన్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి.

నేటి ప్రపంచంలో ఎన్నో చెడ్డ విషయాలు, ప్రలోభాలు మనలో దుష్ట స్వభావాన్ని ప్రేరేపించి తప్పులు చేయిస్తున్నాయి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. మనలో ఉన్న ఏకాదశ రుద్రశక్తిని జాగృత పరుచుకోవడమే దీనికి పరిష్కారం.. ఆత్మసాక్షాత్కారం ద్వారా మనలోని కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు... ఆ ఏకాదశ రుద్ర శక్తులు నుదుటిపైన, శిరస్సు చుట్టూ నిలబడి మనల్ని కాపాడతాయి. సహజయోగ సాధన ద్వారా మనలోని ఆ శక్తులను జాగృతం చేసుకోవడం ద్వారా... దుష్ట శక్తుల ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త పడవచ్చు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఇవి కూడా చదవండి

జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?

మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Updated Date - Sep 12 , 2025 | 05:54 AM