Share News

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:07 AM

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా ఇండియన్‌ మిలిటరీ అకాడమి, ఇండియన్‌ నేవల్‌ అకాడమి, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమి,...

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

మొత్తం ఖాళీలు: 453

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా ఇండియన్‌ మిలిటరీ అకాడమి, ఇండియన్‌ నేవల్‌ అకాడమి, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమి, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీల్లో అడ్మిషన్‌ కల్పిస్తారు.

1. ఇండియన్‌ మిలిటరీ అకాడమి(ఐఎమ్‌ఏ-డెహ్రాడూన్‌)

ఖాళీలు: 100 (13 ఖాళీలు ఆర్మీవింగ్‌లో ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉన్నవారి కోసం కేటాయించారు)

విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌

వయస్సు: 2002 జూలై 2 నుంచి 2007 జూలై1 తేదీలోపు జన్మించిన అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

2. ఇండియన్‌ నేవల్‌ అకాడమి(ఐఎన్‌ఏ-ఎజిమల)

ఖాళీలు: 26 (6 ఖాళీలు నేవల్‌ వింగ్‌లో ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉన్నవారి కేటాయించారు. 2 హైడ్రో కేడర్‌ వారికి)

విద్యార్హతలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌

వయస్సు: 2002 జూలై 2 నుంచి 2007 జూలై1 తేదీలోపు జన్మించిన అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

3. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమి(ఐఎ్‌ఫఏ-హైదరాబాద్‌)

ఖాళీలు: 32 (3 ఖాళీలు నేవల్‌ వింగ్‌లో ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉన్నవారి కేటాయించారు.)

విద్యార్హతలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ లేదా ఎంపీసీతో ఇంటర్‌ చదివి ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: 2026 జూలై 1 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి (2002 జూలై 2 నుంచి 2006 జూలై1 తేదీలోపు జన్మించి ఉండాలి). డీసీసీఏ కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉన్న అభ్యర్థులు అయితే 26 సంవత్సరాల వయస్సు వరకు అర్హులు.


4. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమి(ఓటీఏ-చెన్నై)(పురుషుల నాన్‌ టెక్నికల్‌ కోర్స్‌)

ఖాళీలు: 276

విద్యార్హత: గ్రాడ్యుయేషన్‌

వయస్సు: 2001 జూలై 2 నుంచి 2007 జూలై 1 తేదీలోపు జన్మింఉన్నఅవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

5. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమి (ఓటీఏ-చెన్నై)(మహిళల నాన్‌ టెక్నికల్‌ కోర్స్‌)

ఖాళీలు: 19

విద్యార్హత: గ్రాడ్యుయేషన్‌

వయస్సు: 2001 జూలై 2 నుంచి 2007 జూలై1 తేదీలోపు జన్మించిన అవివాహితులైన మహిళలు, పిల్లలు లేకుండా విడాకులు పొందిన మహిళలు/ భర్త చనిపోయిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష(ఆబ్జెక్టీవ్‌)

ఐఎమ్‌ఏ, ఐఎన్‌ఏ, ఏఎ్‌ఫఏ: ఇంగ్లిష్‌, జీకే, ఎలిమెంటరీ మేథ్స్‌(300 మార్కులు)

ఓటీఏ: ఇంగ్లిష్‌, జీకే(200 మార్కులు)

2. ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూ(సైకలాజికల్‌, గ్రూప్‌ టెస్టింగ్‌, ఇంటర్వ్యూ)

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 17

పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 14

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. బాధ్యులపై కఠిన చర్యలు

కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు

Updated Date - Jun 09 , 2025 | 04:07 AM