Yadagirigutta: యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:00 AM
లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ విదియ నాడు (మార్చి 1న) ప్రారంభం కానున్నాయి. మార్పి 11వ తేదీ... ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకార, వాహన సేవలు, స్వామి వారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇటీవలే స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ పూర్తి చేసుకున్న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ విదియ నాడు (మార్చి 1న) ప్రారంభం కానున్నాయి. మార్పి 11వ తేదీ... ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకార, వాహన సేవలు, స్వామి వారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మార్చి 1: ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచకం, రక్షా బంధనం; సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం
మార్చి 2: ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం; సాయంత్రం 6.30 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం
మార్చి 3: ఉదయం 9 గంటలకు మత్స్వావతార అలంకార సేవ, వేద పారాయణలు ప్రారంభం; రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ
మార్చి 4: ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ; రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ
మార్చి 5: ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ; రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ
మార్చి 6: ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ; రాత్రి 7 గంటలకు సింహవాహన సేవ
మార్చి 7: ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ; రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ, స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం
మార్చి 8: ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారం, హనుమంత వాహన సేవ; రాత్రి 8 గంటలకు గజవాహన సేవ, అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం
మార్చి 9: ఉదయం 9 గంటలకు శ్రీమహావిష్ణు అలంకారం, గరుడవాహన సేవ; రాత్రి 8 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం
మార్చి 10: ఉదయం 10.30 మహా పూర్ణాహుతి, చక్రతీర్థం; రాత్రి 7 గంటలకు శ్రీ పుష్పయాగం,
మార్చి 11: ఉదయం 10 గంటలకు అష్టోత్తర శత ఘటాభిషేకం; రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవం, ఉత్సవ సమాప్తి
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News