8 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:48 AM
గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ నెల 8 నుంచి చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్‌లర్ కేవీవీ సత్యనారాయణరాజు తెలిపారు.

జీజీయూ చాన్స్‌లర్ చైతన్య రాజు
రాజానగరం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ నెల 8 నుంచి చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్‌లర్ కేవీవీ సత్యనారాయణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఇక్కడి వర్సిటీలో ఆవిష్కరించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో రెండు రోజులు సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం వర్సిటీ ప్రాంగణంలో నన్నయ, రాజరాజ నరేంద్ర, వీరేశలింగం పేరిట వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మహాసభలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మా జీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాలకు చెం దిన గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, న్యాయకోవిదులు, భాషా పండితులు, సినీ నటులు, రచయితలు హాజరవుతారని చెప్పారు.