Vijayapura News: సలహా ఇవ్వడమే భర్తకు శాపంగా మారింది..
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:04 PM
Vijayapura News: ఇది తేజుకు నచ్చలేదు. భర్తపై పగ పెంచుకుంది. ఎలాగైనా భర్తను చంపాలనుకుంది. ఆదివారం తెల్లవారుజామున కత్తితో అతడి మెడపై పొడిచింది. దీంతో అతడు గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలు విని కుటుంబసభ్యులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు.
దేశంలో భర్తలకు రక్షణ లేకుండా పోయింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇతర వ్యక్తులతో సంబంధాల నేపథ్యంలో భర్తల అడ్డు తొలగించుకోవడానికి భార్యలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించింది. అతడు ఇచ్చిన సలహా నచ్చకపోవటంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన కర్ణాటకలోని విజయపుర సిటీలో ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ భార్యాభర్తలు. వీరు విజయపుర, జావా నగర్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నారు.
తేజు తరచుగా వేరే మగాళ్లతో చాటింగ్ చేస్తూ ఉండేది. అది కూడా గంటలు, గంటలు చాటింగ్ చేస్తూ ఉండేది. తేజు వ్యవహార శైలి అజిత్‌కు నచ్చలేదు. పద్దతి మార్చుకోవాలని, ఇతర వ్యక్తులతో చాటింగ్ చేయటం మంచిది కాదని సలహా ఇచ్చాడు. ఇది తేజుకు నచ్చలేదు. భర్తపై పగ పెంచుకుంది. ఎలాగైనా భర్తను చంపాలనుకుంది. ఆదివారం తెల్లవారుజామున కత్తితో అతడి మెడపై పొడిచింది. దీంతో అతడు గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్న కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. వెంటనే అతడ్ని బీఎల్డీఈ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స చేశారు. ప్రస్తుతం అజిత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఇక, ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు తేజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తేజు తన భర్తను చాటింగ్ చేయోద్దన్నందుకే చంపాలనుకుందా? లేక వేరే కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. తేజు, అజిత్‌ల ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది.
ఇవి కూడా చదవండి
Mahesh Babu: ఈడీ నోటీసులు.. సమయం కోరిన మహేష్ బాబు
టైటానిక్ మృత్యుంజయుడి లేఖ రూ. 3 కోట్లు