Share News

Pakistani Drone: జమ్ములో పాకిస్తాన్ డ్రోన్.. దానిని ఎలా కూల్చేశారో చూడండి

ABN , Publish Date - May 08 , 2025 | 10:11 PM

మ్ములోని పాకిస్తాన్ డ్రోన్‌ను నేలకూల్చుతున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pakistani Drone: జమ్ములో పాకిస్తాన్ డ్రోన్.. దానిని ఎలా కూల్చేశారో చూడండి
Pakistani drone getting hit

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌లోనూ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ తన అక్కసు వెళ్లగక్కేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఆ క్రమంలో జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్‌ దాడులకు దిగుతోంది. జమ్ములోని ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్‌ దాడి చేసింది. అందుకు సంబంధించిన 8 పాక్‌ మిస్సైల్స్‌ను భారత్ కూల్చేసింది. దాదాపు ఎస్ 400 సిస్టమ్స్‌తో వాటిని భారత్ సైన్యం కూల్చివేసింది.


తాజాగా ఆ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్ములోని పాకిస్తాన్ డ్రోన్‌ను నేలకూల్చుతున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకాశంలోని డ్రోన్‌ను సైన్యం కూల్చేసింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఆ డ్రోన్ నేల పైకి రాక ముందే గాలిలోనే దానిని కూల్చేశారు.

Updated Date - May 08 , 2025 | 11:34 PM