Warren Buffett: యువతకు వారెన్ బఫెట్ అమూల్యమైన సలహాలు
ABN , Publish Date - May 04 , 2025 | 07:15 PM
ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ యువతకు కీలక సూచనలు చేశారు. నిజమైన వృత్తిపరమైన విజయం కేవలం లాభాల మీదే కాకుండా, అంతర్గతంగా ప్రేరేపించే పనిని ఎంచుకోవడంలో ఉందని..
Warren Buffett : ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) యువతకు కీలక సూచనలు చేశారు. మే 3, 2025న జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో యువతకు విలువైన సలహాలు ఇచ్చారు. యువత ఎప్పుడూ మార్కెట్ మీదే దృష్టి పెట్టవద్దని సూచించారు. యువ నిపుణులు ఆర్థిక మార్కెట్లపై తక్కువ దృష్టి పెట్టాలని.. నైతిక వృద్ధి, జీవితకాల అభ్యాసాన్ని ప్రేరేపించే వ్యక్తులతో గడపడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా కాకుండా విలువలు, తమ.. తమ అభిరుచులను పరిగణలోకి తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జ్ఞానంలో "మీ కంటే మెరుగైన" వ్యక్తులతో నడవాలని, "ఇతరులు అందించే ఏదైనా సహాయాన్ని తిరిగి ఇవ్వాలి" అని కూడా ఆయన చెప్పారు. $100 బిలియన్లకు పైగా నికర విలువ కలిగిన పెట్టుబడిదారుడు, పేలవమైన రోల్ మోడల్‌లను అనుసరించకూడదని కూడా హెచ్చరించారు, "మీరు జీవితంలో కూడా మంచి ఉద్దేశాలు.. తదననుగుణంగా ప్రవర్తనతో ముందుకు సాగాలి." అని పేర్కొన్నారు. "మీరు ఎవరితో క్లోజ్ గా మూవ్ అవుతారో.. అది చాలా ముఖ్యమైనది" అన్న బఫెట్.. "మీరు పనిచేసే, మీరు ఆరాధించే, మీ స్నేహితులుగా మారే వ్యక్తులను బట్టి మీ జీవిత పురోగతి ఉంటుంది." అని అన్నారు.
నిజమైన వృత్తిపరమైన విజయం కేవలం లాభాల గురించే కాకుండా, అంతర్గతంగా ప్రేరేపించే పనిని ఎంచుకోవడంలో ఉందని బఫెట్ నొక్కి చెప్పారు. అధిక జీతం కంటే ఉత్సుకత, నిరంతర అభ్యాసం..ఇంకా ఆలోచనాత్మక కెరీర్ ఎంపికలు ముఖ్యమని ఆయన అన్నారు. "మీరు పని చేయడానికి అద్భుతమైన వ్యక్తులను కనుక్కుంటే, అదే మీకు సగం విజయం." అని ఆయన సలహా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు
Viral Video: వస్తువులు తిరిగి తీసుకోలేదని 15 ఏళ్ల బాలిక దారుణం..