VIT: క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో ‘వీఐటీ’కి చోటు
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:01 AM
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2025లో వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) స్థానం దక్కించుకుంది. 14 పాఠ్యాంశాల బోధనలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సరసన నిలిచింది.

చెన్నై, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2025లో వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) స్థానం దక్కించుకుంది. 14 పాఠ్యాంశాల బోధనలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సరసన నిలిచింది. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాఠ్యాంశాలకు సంబంధించి.. ఏకంగా ప్రపంచంలోని టాప్-100 వర్సిటీల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ విద్యావిశ్లేషకుడు క్యాక్వారెల్లి సైమండ్స్ బుధవారం ఈ జాబితాను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1700 విశ్వవిద్యాలయాల్లో 55 రకాల పాఠ్యాంశాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2025 ఎడిషన్‌ను రూపొందించారు. ఈ విశ్లేషణాత్మక అధ్యయనంలో వీఐటీ విశేష ప్రతిభను ప్రదర్శించింది. 4 పాఠ్యాంశాల ర్యాంకులను మెరుగుపర్చుకోవడంతోపాటు మరో 8 పాఠ్యాంశాల ర్యాంకులను యథాతథంగా కాపాడుకోగలిగింది. మరో రెండు పాఠ్యాంశాలు తొలి సారి ర్యాంకింగ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. విద్య, పరిశోధన నైపుణ్యాలకు వీఐటీ పెద్దపీట వేస్తుందనడానికి ఈ ర్యాంకులే ఉదాహరణ అని నిర్వాహకులు తెలిపారు.
వీఐటీలో బోధిస్తున్న పాఠ్యాంశాలకు దక్కిన పాయింట్లు
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ: 142, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్:110, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: 51- 100, ఇంజనీరింగ్ - ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్:151-200, ఇంజనీరింగ్- మెకానికల్, ఏరోనాటికల్ అండ్ మానుఫ్యాక్చరింగ్: 201-250, ఇంజనీరింగ్ - కెమికల్: 251 - 300, న్యాచురల్ సైన్సెస్: 362, మెటీరియల్ సైన్స్: 151-200, మ్యాథమెటిక్స్: 201-250, స్టాటిస్టిక్స్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్: 251-275, కెమిస్ట్రీ: 301-350, ఫిజిక్స్ అండ్ అస్ట్రానమీ: 401-450, ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్: 451-500, బయోలాజికల్ సైన్సెస్: 351-400, అగ్రికల్చరర్ అండ్ ఫారెస్ట్రీ: 351-400, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్: 551-600