Bangladesh : బంగ్లాదేశ్‌లో హింస.. హసీనా ప్రసంగమే కారణం
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:38 AM
బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లకు నిరసనకారులు

ఢాకా, ఫిబ్రవరి 7: బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు. మ్యూజియంగా మార్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై వేలాది మంది దాడి చేసి నిప్పంటించారు. షేక్ హసీనా బుధవారం రాత్రి ఆన్‌లైన్‌లో చేసిన ప్రసంగం కారణంగా తాజా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఆమె అవామీ లీగ్ నేతలకు పిలుపునిచ్చారు. దీంతో హసీనా వ్యతిరేకులు రెచ్చిపోయారు.