Actor Filmmaker Sreenivasan: ఇండస్ట్రీలో పెను విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:39 AM
ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 69 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.
భారత చలన చిత్ర రంగంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ తెలుగు దర్శకుడు కిరణ్ కుమార్ మరణించి వారం కూడా కాకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 69 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి ఆయన ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని త్రిపునితురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిన్నటినుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు.
శనివారం తెల్లవారు జామున శ్రీనివాసన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఆయన్ని రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శ్రీనివాసన్ చనిపోయారు. శ్రీనివాసన్ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.
ప్రస్థానం ఇది..
శ్రీనివాసన్ 1956, ఏప్రిల్ 6వ తేదీన కేరళలోని పట్యంలో జన్మించారు. సినిమాల మీద ఆసక్తితో చెన్నైలోని ఫిల్మ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1977లో విడుదలైన ‘మని ములక్కమ్’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 225 సినిమాల్లో నటించారు. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాదు రచయితగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కూడా తన సత్తా చాటారు. రాష్ట్ర, జాతీయ అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి
బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహుర్తం ఫిక్స్
తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. సాగునీటి హక్కులపై సమరశంఖం