Share News

Vande Bharat: 180 కి.మీ. వేగంతో వందే భారత్‌ స్లీపర్‌

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:43 AM

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజా పరీక్షలో వందేభారత్‌ స్లీపర్‌ రైలు 180 కి.మీ. వేగాన్ని అందుకుంది.

Vande Bharat: 180 కి.మీ. వేగంతో వందే భారత్‌ స్లీపర్‌

న్యూఢిల్లీ, జనవరి 3: వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజా పరీక్షలో వందేభారత్‌ స్లీపర్‌ రైలు 180 కి.మీ. వేగాన్ని అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. రెండు బెర్తుల మధ్య ఉన్న ట్రేపై ఉంచిన మొబైల్‌ రైలు ప్రయాణ వేగాన్ని సూచిస్తోంది. దాని పక్కనే నీళ్లు నిండుగా పోసిన గాజు గ్లాసు ఉంది. రైలు 170 కి.మీ. నుంచి క్రమంగా 180 కి.మీ. వేగానికి చేరుకోవడాన్ని, అంత వేగంలోనూ చుక్క నీరు తొలక్కపోవడాన్ని ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కోట, లబాన్‌ స్టేషన్ల మధ్య 30 కి.మీ. దూరం ఈ పరీక్షకు వేదికయింది. జనవరి 1న రోహల్‌ కుర్ద్‌, కోటా మధ్య 40 కి.మీ. దూరం ఉన్న ట్రాక్‌పై ఇదే మాదిరి పరీక్ష నిర్వహించారు. ఆరోజు కూడా రైలు ఇదే వేగాన్ని అందుకుంది.

Updated Date - Jan 04 , 2025 | 04:43 AM