UCC : ఉత్తరాఖండ్‌లో అమల్లోకి యూసీసీ
ABN , Publish Date - Jan 28 , 2025 | 06:20 AM
ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) విధానం అమలులోకి వచ్చింది. దేశంలోనే యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ పోర్టల్,
న్యూఢిల్లీ, జనవరి 27: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) విధానం అమలులోకి వచ్చింది. దేశంలోనే యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ పోర్టల్, నోటిఫికేషన్‌లను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ సోమవారం ఆవిష్కరించారు. ‘‘యూసీసీ అమలు రాజ్యాంగబద్ధ చర్య. ఇది వివక్షను అంతం చేస్తుంది. నిజమైన అర్థంలో మహిళా సాధికారికత సాకారం కానుంది. నిఖా హలాల్, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్ వంటి దుష్ట విధానాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. రాజ్యాంగంలోని 342 అధికరణ కింద రక్షణ పొందుతున్న ఆదివాసీలకు యూసీసీ నుంచి మినహాయింపు ఉంటుంది. యూసీసీ ఏ ఒక్క మతానికీ, తెగకూ వ్యతిరేకం కాదని మళ్లీ స్పష్టం చేస్తున్నాం’’ అని ధామీ అన్నారు.