Share News

Tariffs: భారత్‌, చైనాపై మీరూ సుంకాలు విధించండి

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:17 AM

భారత్‌పై తాము విధించినట్లే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కూడా అదనపు సుంకాలు వేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.

Tariffs: భారత్‌, చైనాపై మీరూ సుంకాలు విధించండి

  • ఐరోపా సమాఖ్యపై అమెరికా ఒత్తిడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: భారత్‌పై తాము విధించినట్లే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కూడా అదనపు సుంకాలు వేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. దీంతో పాటు భారత్‌ నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలును ఆపివేయాలని కూడా కోరుతోంది. అలాగే, రష్యాపై తాను మాత్రమే ఒత్తిడి తేవడం కాకుండా.. ఈయూ కూడా కలిసి రావాలని అమెరికా పట్టుబడుతోంది. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలుపై ఈయూ పూర్తి నిషేధం విధించాలని అడుగుతోంది.


ఈ విషయాలను ఇండియా టుడే, అమెరికాకు చెందిన న్యూస్‌ వెబ్‌సైట్‌ యాక్సియస్‌.. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు ప్రచురించాయి. ఈయూ కూడా భారత్‌తో పాటు చైనాపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా కోరినట్లు ఇండియా టుడే పేర్కొంది.

Updated Date - Sep 02 , 2025 | 01:35 AM