Share News

Women Jailed Husband: మరీ ఇంత దారుణమా.. భర్తపై కక్ష్య గట్టి.. చివరకు

ABN , Publish Date - Apr 11 , 2025 | 09:31 AM

భర్తను జైలుకి పంపి.. దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భార్య చేసే అవమానాలు తట్టుకోలేక తీవ్రంగా కృంగిపోయాడు. భార్య తీరుతో జీవితం మీద విరక్తి పెంచుకున్న ఆ వ్యక్తి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

Women Jailed Husband: మరీ ఇంత దారుణమా.. భర్తపై కక్ష్య గట్టి.. చివరకు
UP Crime

లక్నో: గృహహింస కేసులు అనగానే కేవలం ఆడవారు మాత్రమే అనుభవించే వేధింపులు కావు.. నేటి కాలంలో మగవాళ్లు కూడా గృహ హింసకు గురవుతున్నారు. దారుణం ఎంటంటే భార్య, అత్తింటి వారి వేధింపుల గురించి బయటకు చెప్పుకోలేక.. వారిలో వారే నరకం అనుభవిస్తున్నారు. వేధింపుల తీవ్రత పెరిగితే.. ఏకంగా ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఈమధ్య కాలంలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను జైలుకి పంపి.. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిందో మహిళ. ఆ అవమానం తట్టుకోలేకపోయిన బాధితుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. శాశ్వత నిద్రలోకి వెళ్తున్నాను అమ్మ అంటూ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆ వివరాలు..


ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌, బరేలీలో చోటు చేసుకుంది. రాజ్ ఆర్య అనే వ్యక్తి అతడి భార్య సిమ్రాన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సిమ్రాన్ సోదరుడు ఒకరు పోలీసు అధికారి కావడంతో.. అతడి సాయంతో సిమ్రాన్, ఆమె కుటుంబ సభ్యులు రాజ్ ఆర్యను అవమానించారని.. మానసికంగా వేధించారని మృతుడి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

భర్త జైలుకు.. సోషల్ మీడియాలో పోస్టులు..

అంతేకాక ఆర్య చనిపోయే ముందు సిమ్రాన్.. అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో.. 10.30 వరకు నువ్వు జైలుకు వెళ్తావు.. బెస్ట్ ఆఫ్ లక్.. ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్లు అని పోస్ట్ చేసింది. ఆ తర్వాత రాజ్ ఆర్యను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. కస్టడీలో అతడిని తీవ్రంగా అవమానించినట్లు ఆర్య తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.


అత్తింటిలో తీవ్ర అవమానం..

రాజ్, సిమ్రాన్ దంపతులకు ఏడాది క్రితమే వివాహం అయ్యింది. వారికి ఒక కొడుకు కూడ ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచే వారి మధ్య సఖ్యత కొరవడింది. తరచుగా గొడవపడేవారు. ఇలా ఉండగా రాజ్ ఆత్యహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు కూడా గొడవ జరిగింది. సిమ్రాన్‌ను పుట్టింటి నుంచి తీసుకురావడం కోసం రాజ్.. ఆ రోజు షాజహాన్‌పూర్ వెళ్లాడు. ఆ తర్వాత వారు డెహ్రడూన్‌లో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరు కావాల్సి ఉంది.

అయితే సిమ్రాన్, రాజ్‌తో కలిసి ఆ పెళ్లికి వెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాక సిమ్రాన్ సోదరుడు రాజ్‌ను దారుణంగా అవమానించాడు. సిమ్రాన్ తండ్రి కళ్ల ముందే ఇదంతా జరిగినా.. అతడు వారిని వారించలేదు. అవమాన భారంతో కుంగిపోయిన రాజ్.. తిరిగి తన స్వస్థలం బరేలీ చేరుకున్నాడు. దాంతో సిమ్రాన్ కుటుంబం.. రాజ్, అతడి కుటుంబ సభ్యుల మీద మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు రాజ్‌ను స్టేషన్‌కు పిలిపించారు.


అమ్మ శాశ్వత నిద్రలోకి వెళ్తున్నానంటూ..

రాజ్ రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాడు. పోలీసు అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు, మరికొందరు పోలీసులతో కలిసి.. రాజ్‌ని శారీరకంగా హింసించాడు. రాజ్ గురువారం ఇంటికి వచ్చాడు. పోలీసు స్టేషన్‌లో జరిగిన అవమానంతో కుంగిపోయాడు. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తల్లి దగ్గరకు వెళ్లి.. అమ్మ నేను శాశ్వత నిద్రలోకి వెళ్లాలనుకుంటున్నాను.. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పాడు.

అయితే రాజ్ తల్లి అతడు ఇంతటి దారుణానికి పాల్పడతాడని ఏమాత్రం ఊహించలేదు. అలసిపోయి ఉన్నాడు.. అందుకే అలా చెప్పాడని భావించింది. తన గదిలోకి వెళ్లిన రాజ్.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


మరో వ్యక్తితో వివాహేతర బంధం

రాజ్ సోదరి మాట్లాడుతూ.. "పెళ్లైన నాటి నుంచే సిమ్రాన్ నా సోదరుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పైగా ఆమెకు తన స్నేహితుడితో వివాహేతర బంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా అతడితో బంధాన్ని కొనసాగించింది.. గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఆమెలో మార్పు రావాలని కోరుకున్నాము. కానీ చివరకు ఆమె మా సోదరుడి ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించింది" అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సిమ్రాన్ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

Woman Viral Video: ఎందుకొచ్చిందో.. ఎందుకెళ్లిందో.. మెట్రోలో యువతి నిర్వాకం చూసి అంతా షాక్..

Shock: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..

Updated Date - Apr 11 , 2025 | 09:37 AM