Share News

Operation Sindoor: భారత్-పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి రెడీ: అమెరికా విదేశాంగ మంత్రి

ABN , Publish Date - May 08 , 2025 | 11:13 PM

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని, శాంతి కోసం ఇరు దేశాల నేతలు ప్రయత్నించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సూచించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. అలాగే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కూడా మాట్లాడారు.

Operation Sindoor: భారత్-పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి రెడీ: అమెరికా విదేశాంగ మంత్రి
Marco Rubio

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని, శాంతి కోసం ఇరు దేశాల నేతలు ప్రయత్నించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సూచించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. అలాగే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కూడా మాట్లాడారు. అవసరమైతే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.


ఉగ్రవాదాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ భారీగా మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి పాల్పడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రాంతాలను టార్గెట్ చేసి డ్రోన్ల దాడికి పాల్పడుతోంది. ఆ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే రెండు పాక్ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసినట్టు సమాచారం.

Updated Date - May 08 , 2025 | 11:13 PM