Union Minister Suresh Gopi: కేంద్ర మంత్రిగా దిగిపోతా..సినిమాలు చేసుకుంటా
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:32 AM
కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరువనంతపురం, అక్టోబరు 13: కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి అయినప్పటి నుంచి తన ఆదాయం గణనీయంగా తగ్గిందని, మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకొంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ తనను తొలగించి.. బీజేపీ రాజ్యసభ ఎంపీ సదానందన్ మాస్టార్‌ను కేంద్ర మంత్రిగా చేస్తే, అది కేరళ రాజకీయాల్లో కొత్త చరిత్ర అవుతుందన్నారు. సురేశ్ గోపి కేరళలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆయన కన్నూరులో ఆదివారం సదానందన్ మాస్టార్ ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ గోపి మాట్లాడుతూ.. ‘నేను డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను. నా పిల్లలు ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు. నా ఆదాయంపై ఆధారపడ్డ వారు కొంత మంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.