Lalan Singh: పేదలను పోలింగ్ బూత్ వరకు రానియొద్దు
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:18 AM
పేదలను ఓటు వేయనీయకండి అంటూ కేంద్ర మంత్రి, జేడీ(యూ) నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమయింది.
కేంద్రమంత్రి లలన్ సింగ్ వ్యాఖ్య.. పోలీసు కేసు నమోదు
పట్నా, నవంబరు 4: పేదలను ఓటు వేయనీయకండి అంటూ కేంద్ర మంత్రి, జేడీ(యూ) నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమయింది. మొకామాలో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలు జరిగే రోజున పేదలు పోలింగ్ స్టేషన్ వరకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లాలు ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ దీనిపై హిందీలో ట్వీట్ చేస్తూ లలన్ సింగ్..ఎన్నికల కమిషన్ అఽధికారాన్ని బహిరంగంగా సవాలు చేస్తున్నారని విమర్శించింది. ఎన్నికల కమిషన్ ఛాతీపై నుంచి బుల్డోజర్‌ను పంపించారని వ్యాఖ్యానించింది. దీనిపై ఇతర పార్టీలు కూడా విమర్శలు చేయడంతో పట్నా జిల్లా పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు పంపించింది.