Share News

Unified Pension : ఏకీకృత పెన్షన్‌ పథకం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:43 AM

ఏకీకృత పెన్షన్‌ పథకాన్ని(యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌-యూపీఎస్‌) అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గెజిట్‌

Unified Pension : ఏకీకృత పెన్షన్‌ పథకం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ, జనవరి 25: ఏకీకృత పెన్షన్‌ పథకాన్ని(యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌-యూపీఎస్‌) అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి యూపీఎస్‌ అమల్లోకి వస్తుంది. జాతీయ పెన్షన్‌ వ్యవస్థ(ఎన్‌పీఎ్‌స) పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఎన్‌పీఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎ్‌సను ఎంచుకోవచ్చిక. పాత పెన్షన్‌ పథకం(ఓపీఎస్‌), ఎన్‌పీఎ్‌స ఫీచర్ల సమ్మేళనం ద్వారా కేంద్రం గత ఏడాది యూపీఎ్‌సను ప్రవేశపెట్టింది. ఓపీఎస్‌ తరహాలోనే యూపీఎస్‌ కూడా పదవీ విరమణ అనంతరం గ్యారెంటీ పెన్షన్‌ ఆఫర్‌ చేస్తుంది. పదవీ విరమణకు ముందు 12 నెలల్లో పొందిన కనీస వేతనం(బేసిక్‌ పే) సగటులో 50 శాతం పెన్షన్‌గా లభిస్తుంది.

Updated Date - Jan 26 , 2025 | 04:43 AM