Share News

Uber India: ఉబర్‌కు రూ. 54 వేల జరిమానా

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:31 AM

ఉబర్‌ ఇండియాకు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వినియోగదారుడికి రూ. 54వేలు చెల్లించాలని ఆదేశించింది.

 Uber India: ఉబర్‌కు రూ. 54 వేల జరిమానా

న్యూఢిల్లీ, జనవరి 4: ఉబర్‌ ఇండియాకు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వినియోగదారుడికి రూ. 54వేలు చెల్లించాలని ఆదేశించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ డాక్టర్‌ 2021 నవంబరు 29న ఇందౌర్‌ వెళ్లడానికి విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఉదయం 3.15 గంటలకు ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుకు బయలుదేరడానికి ఉబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేశాడు. ఎంతకీ క్యాబ్‌ రాకపోవడంతో డ్రైవర్‌కు ఫోన్‌చేశాడు. కానీ సదరు డ్రైవర్‌ స్పందించలేదు. దీంతో ఉబర్‌ కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మరో ట్యాక్సీ మాట్లాడుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అప్పటికే తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోయింది. దీంతో ఆ డాక్టర్‌.. వినియోగదారుల ఫోరంలో ఉబర్‌ ఇండియాపై దావా వేశాడు. కోర్టు ఉబర్‌కు రూ.54 వేల ఫైన్‌ విధించింది. ఇంకో విమాన టికెట్‌కు అయిన ఖర్చు రూ. 24 వేలు, మానసిక క్షోభకు రూ.30 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - Jan 05 , 2025 | 02:31 AM