Investment Options: పెన్షన్ పథకాల్లో మరో రెండు ఐచ్ఛికాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:05 AM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ స్కీం.....
న్యూఢిల్లీ, అక్టోబరు 24: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎ్‌స), యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎ్‌స)లలో మరో రెండు పెట్టుబడుల ఐచ్ఛికాలను అమలు చేయనున్నట్టు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రటించింది. లైఫ్ సైకిల్ (ఎల్‌సీ), బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ (బీఎల్‌సీ) పేరుతో వీటిని అమలు చేయనున్నట్టు తెలిపింది. పదవీ విరమణ ప్రణాళికలను మరింత సరళతరం చేసి, పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని పేర్కొంది. ఉద్యోగులు నచ్చిన స్కీంను ఎంచుకోవచ్చని తెలిపింది. షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలిగించింది. లైఫ్ సైకిల్ ఆప్షన్‌లో ఎల్‌సీ-25 కింద గరిష్ఠంగా 25శాతం వరకు ఈక్విటీలను కేటాయిస్తారు. 35 ఏళ్ల నుంచి 55 ఏళ్లు వచ్చే వరకు కొనసాగించవచ్చు. ఎల్‌సీ-50 కింద రిటైర్మెంట్ నిఽధిలో గరిష్ఠంగా 50శాతం వరకు ఈక్విటీలు కేటాయిస్తారు. ఎల్‌సీ-50కి కొన్ని మార్పులు చేసి బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ (బీఎల్‌సీ) ఆప్షన్‌ను రూపొందించారు. దీనికింద 45 ఏళ్లు వచ్చిన తరువాతే పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడులను నచ్చినంత కాలం కొనసాగంచుకునే వెసులుబాటు ఉంది. ఎల్‌సీ 75 కింద గరిష్ఠంగా 75శాతం ఈక్విటీలు ఇస్తారు. 35 నుంచి 55 ఏళ్లు వచ్చే వరకు వీటిని కొనసాగించవచ్చు. స్కీం-జీ కింద 100శాతం సొమ్మును ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టవచ్చు. పీఎ్‌ఫఆర్‌డీఏ అమలు చేస్తున్న వివిధ రకాల పథకాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.