Vijay friend joins DMK: విజయ్ పార్టీకి షాక్.. డీఎంకేలో చేరిన సన్నిహితుడు..
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:16 PM
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కన్నూర్ సభ గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే తాజాగా మరో ఝులక్ తగిలింది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కన్నూర్ సభ గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే తాజాగా మరో ఝులక్ తగిలింది. విజయ్ సన్నిహితుడు సెల్వ కుమార్ పార్టీని వీడారు. వెంటనే ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకేలో చేరిపోయారు (TVK party update).
టీవీకేలో తనకు గౌరవం దక్కలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన్న వారికే ప్రాధాన్యమిచ్చారని, టీవీకేలో కష్టపడి పనిచేసేవారికి విలువలేదని సెల్వకుమార్ పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిపోయారు. నిజానికి సెల్వకుమార్‌కు టీవీకేలో అధికారిక పదవి ఏదీ లేదు. అయితే ఆయన విజయ్‌కు సన్నిహితుడు కావడంతో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే నేతలు సెల్వకుమార్ చేరికను స్వాగతించారు. భవిష్యత్తులో మరికొందరు కూడా తమ పార్టీలో చేరతారని తెలిపారు (Vijay political news).
సెల్వకుమార్ పార్టీని వీడడం గురించి ఇప్పటివరకు టీవీకే నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు ( Tamil Nadu politics). అయితే తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ సన్నిహితుడు డీఎంకేలో చేరడం టీవీకేపై చూపే రాజకీయ ప్రభావం గురించి చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..