Share News

US Turkey missile deal: తుర్కియేకు అమెరికా సైడ్‌ విండర్‌ క్షిపణులు

ABN , Publish Date - May 18 , 2025 | 05:26 AM

తుర్కియేకు 60 AIM-9X సైడ్‌విండర్‌ క్షిపణుల సరఫరాకు అమెరికా 304 మిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ క్షిపణులు పాకిస్థాన్‌కు వెళ్లే ప్రమాదం ఉన్నందున భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.

US Turkey missile deal: తుర్కియేకు అమెరికా సైడ్‌ విండర్‌ క్షిపణులు

న్యూఢిల్లీ, మే 17 : తుర్కియేకు 304 మిలియన్‌ డాలర్ల విలువైన క్షిపణులను విక్రయించే ఒప్పందానికి ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా.. ఆ ఒప్పందంలో భాగంగా 60 ఏఐఎం-9ఎక్స్‌ సైడ్‌ విండర్‌ క్షిపణులను సరఫరా చేయనుంది. స్వల్ప శ్రేణి ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణి అయిన సైడ్‌ విండర్‌ను ఎఫ్‌-16వీ యుద్ధ విమానాల్లో వినియోగించవచ్చు. గగనతలంలో యుద్ధ విమానాల మధ్య జరిగే పోరులో ఈ సైడ్‌ విండర్‌ క్షిపణులు అత్యంత ప్రభావం చూపుతాయి. తుర్కియే ఇటీవల 40 ఎఫ్‌-16వీ విమానాలను సమకూర్చుకోగా.. ఈ సైడ్‌ విండర్‌లతో ఆ దేశ వాయుసేన మరింత బలోపేతం కానుంది. అయితే, భారత్‌కు వ్యతిరేకంగా ఇటీవల పాకిస్థాన్‌కు డ్రోన్లు, క్షిపణులు అందజేసిన తుర్కియే.. ఈ సైడ్‌విండర్‌లను కూడా పాక్‌కు ఇచ్చే ముప్పు ఉంది.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:26 AM