Share News

PM Modi: బంగ్లాదేశ్‌పై నిర్ణయం మోదీదే!

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:09 AM

శుక్రవారం ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్‌ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందన. మరోవైపు బంగ్లాదేశ్‌లో గత ఏడాది షేక్‌ హసీనా పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను అదుపు చేసే క్రమంలో మానవ హక్కుల

PM Modi: బంగ్లాదేశ్‌పై నిర్ణయం మోదీదే!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ‘‘బంగ్లాదేశ్‌పై నిర్ణయాన్ని మోదీకే వదిలేస్తున్నా...’’ ఇది ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా... శుక్రవారం ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్‌ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందన. మరోవైపు బంగ్లాదేశ్‌లో గత ఏడాది షేక్‌ హసీనా పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను అదుపు చేసే క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్‌) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. దీంతో ఆ దేశ రాజకీయం వేడెక్కింది. బంగ్లాదేశ్‌ ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ.. హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను కోరింది. హసీనా సామూహిక హత్యలకు పాల్పడ్డారని, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక వ్యవస్థలను నాశనం చేశారని యూఎన్‌ నివేదిక ఆరోపించిందని ఆ పార్టీ కీలక నేత చెప్పారు.

Updated Date - Feb 15 , 2025 | 05:09 AM