Share News

Kaliganj: టీఎంసీ సంబరాల్లో నాటు బాంబు పేలి.. బాలిక మృతి

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:12 AM

కాళీగంజ్‌లో తమ పార్టీ విజయానికి టీఎంసీ కార్యకర్తలు సోమవారం విజయోత్సవాలు చేసుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ సీపీఎం కార్యకర్త ఇంటి వద్ద...

Kaliganj: టీఎంసీ సంబరాల్లో నాటు బాంబు పేలి.. బాలిక మృతి

కోల్‌కతా, జూన్‌ 23: కాళీగంజ్‌లో తమ పార్టీ విజయానికి టీఎంసీ కార్యకర్తలు సోమవారం విజయోత్సవాలు చేసుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ సీపీఎం కార్యకర్త ఇంటి వద్ద వారు క్రూడ్‌ బాంబులు పేల్చడంతో అక్కడే ఉన్న బాలిక తమన్నా ఖాతూన్‌ తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పేలుడుకు కారకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ‘ఎక్స్‌’లో తెలిపారు.

Updated Date - Jun 24 , 2025 | 04:14 AM