Share News

Amit Shah: కర్రెగుట్టలో చారిత్రక విజయం: అమిత్‌షా..

ABN , Publish Date - May 14 , 2025 | 08:25 PM

కర్రెగుట్టలు ఒకప్పుడు నక్సలైట్ల రాజ్యంగా ఉండేవని, ఇప్పుడు మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని అమిత్‌షా అన్నారు. 21 రోజుల్లోనే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాయని ప్రశంసించారు.

Amit Shah: కర్రెగుట్టలో చారిత్రక విజయం: అమిత్‌షా..

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నిర్వహించిన 'ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్‌'లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. నక్సల్స్‌ ఏరివేతకు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌‌లో భారత్ సాధించిన చరిత్రాత్మక విజయంగా దీనిని అభివర్ణించారు. కర్రెగుట్టలు ఒకప్పుడు నక్సలైట్ల రాజ్యంగా ఉండేవని, ఇప్పుడు మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని అన్నారు. 21 రోజుల్లోనే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని ప్రశంసించారు. 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఇది ప్రతీకని అమిత్ షా అన్నారు.

Colonel Sofiya Qureshi: కల్నల్ ఖురేషిపై వ్యాఖ్యలు.. మంత్రికి హైకోర్టు షాక్


gutta.jpg

ప్రధానమైన మావోయిస్టు గ్రూప్‌లన్నింటికీ కర్రెగుట్టలు ఒకప్పుడు ప్రధాన కార్యాలయంగా ఉండేవని, ఇక్కడే పోరాట వ్యూహాల రూపకల్పన, ఆయుధాల అభివృద్ధి, ఫైటర్లకు శిక్షణ జరిగేవని అమిత్‌షా చెప్పారు. మన బలగాలు ఒక్కరిని కూడా కోల్పోకుండా కేవలం 21 రోజుల్లో ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆ ఆపరేషన్‌లో మావోయిస్టులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్‌ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్‌లకు అభినందనలు తెలియజేశారు. ''మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది'' అని ప్రశంసించారు.


operation.jpg

కాగా, 21 రోజులపాటు సాగిన కర్రెగుట్ర ఆపరేషన్‌లో 31మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. 450 ఐఈడీలు, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పెద్దఎత్తున ఆయుధ సామగ్రి, డిటొనేటర్లు, పేలుడు పదార్ధాలు, మెడిసన్లు-ఎలక్ట్రానిక్ పరికారాలతో కూడిన 12,000 కేజీల ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆయుధాలు తయారు చేసే నాలుగు ఫ్యాక్టరీలు, మోటార్లు, కట్టర్లు బయటపడ్డాయన్నారు. 214 బంకర్లు గుర్తించి ధ్వంసం చేసినట్టు చెప్పారు. బంకర్లలో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కూబింగ్‌లో 18మంది జవాన్లు గాయపడ్డారని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..

India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 08:50 PM