Share News

Train Collision in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో గూడ్స్‌, ప్యాసింజర్‌ రైళ్ల ఢీ

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:38 AM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలా్‌సపూర్‌లో ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ ట్రైను ఢీకొన్నాయి. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో బిలా్‌సపూర్‌ రైల్వే స్టేషన్‌.....

  Train Collision in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో గూడ్స్‌, ప్యాసింజర్‌ రైళ్ల ఢీ

  • ఎనిమిది మంది మృతి.. 14మందికి గాయాలు

బిలా్‌సపూర్‌, నవంబరు 4: ఛత్తీస్‌గఢ్‌లోని బిలా్‌సపూర్‌లో ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ ట్రైను ఢీకొన్నాయి. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో బిలా్‌సపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో లాల్‌ ఖండ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ రైలు గూడ్సును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో, ప్యాసింజర్‌ ముందుభాగం గూడ్స్‌ ట్రైను బోగీల మీదకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. 14మంది గాయపడ్డారు. రెండు రైళ్లకు సంబంధించిన కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం కారణంగా బిలా్‌సపూర్‌-హావ్‌డా మార్గంలో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.1లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.

Updated Date - Nov 05 , 2025 | 04:38 AM