Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:27 AM
చత్తీ్‌సగఢ్ రాష్ట్రం మోహ్లా మన్పూర్ అంబర్గ్ చౌక్ జిల్లా మదన్‌వాడ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో..
ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి
దుమ్ముగూడెం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): చత్తీ్‌సగఢ్ రాష్ట్రం మోహ్లా-మన్పూర్-అంబర్గ్ చౌక్ జిల్లా మదన్‌వాడ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు. వీరిని విజయ్‌రెడ్డి, లోకేష్ సలామిలుగా గుర్తించారు. వీరివురిపై రూ.35లక్షల రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయ్‌రెడ్డి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, సలామి.. డివిజన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు బందాపహాడ్ కొండను నలువైపులా పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. జోరు వర్షం పడుతుండగానే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని మోహ్లా-మన్పూర్-అంబర్గ్ చౌక్ ఎస్పీ వైపీ సింగ్ ధ్రువీకరించారు.