Share News

Uttar Pradesh: కోతులపైకి తండ్రి గొడ్డలి..అది తగిలి కొడుకు మృతి

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:43 AM

కోతులపైకి విసిరిన గొడ్డలి తగిలి రెండేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది.

Uttar Pradesh: కోతులపైకి తండ్రి గొడ్డలి..అది తగిలి కొడుకు మృతి

మొరాదాబాద్‌, జూన్‌ 4: కోతులపైకి విసిరిన గొడ్డలి తగిలి రెండేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. మొరాదాబాద్‌లో రెండేళ్ల బాలుడు ఆరవ్‌ తన ఇంట్లో ఆడుకుంటుండగా అక్కడికి కోతులు వచ్చాయి. దీంతో అతడి తండ్రి లఖన్‌ సింగ్‌ అవి బాలుడికి హాని చేస్తాయని భావించి వాటిని తరిమేందుకు గొడ్డలి విసిరాడు.


అయితే ప్రమాదవశాత్తు ఆ గొడ్డలి ఆరవ్‌ మెడపై తగలడంతో తీవ్రగాయమయ్యింది. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు చెప్పారు.

Updated Date - Jun 05 , 2025 | 04:44 AM