Thousands of Aadhaar Cards: చెరువులో వేలాది ఆధార్‌కార్డులు..
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:53 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సాగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని ఓ చెరువులో వేలాది ఆధార్‌కార్డులు
‘సర్’ కొనసాగుతున్న వేళ బెంగాల్‌లో వివాదం
కోల్‌కతా, నవంబరు 6: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సాగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని ఓ చెరువులో వేలాది ఆధార్‌కార్డులు లభించడం రాజకీయ దుమారం రేపింది. పూర్బస్థలీ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ దేశ అంతర్గత భద్రతను తాకట్టు పెట్టారని ఆరోపించింది. చొరబాటుదారులకు రాష్ట్రం ఓ సురక్షితమైన స్థావరంగా మారిందని ఈ ఘటన రుజువు చేస్తోందని పేర్కొంది.