Share News

Plane Crash Reasons: విమానాలు టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు కూలిపోతాయో తెలుసా?

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:02 PM

అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే, సాధారణంగా విమానాలు టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు కూలిపోతాయో తెలుసా?

Plane Crash Reasons: విమానాలు టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు కూలిపోతాయో తెలుసా?
Plane Clash

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 230 మంది ప్రయాణికులు , 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానాలు టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు కూలిపోతాయి? దీనికి కారణాలు ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


పైలట్ తప్పిదం:

విమానం నడిపే పైలట్ చేసే తప్పుల వల్ల కొన్నిసార్లు విమానం కూలిపోవచ్చు. ఒత్తిడి, అలసట, విమానం నడపడంలో తప్పు చేయడం, కమ్యూనికేషన్ లోపాలు, కొన్నిసార్లు ఆరోగ్య సంబంధిత సమస్యలు. ఇలాంటి సమస్యల వల్ల కూడా విమానం కూలిపోయే ప్రమాదం ఉంది.

సాంకేతిక లోపం:

విమానంలో సాంకేతిక లోపం వల్ల కూడా విమానం పేలిపోయే ప్రమాదం ఉంది. విమానంలోని ఏదైనా భాగం సరిగ్గా పనిచేయకపోవడం, విమాన ఇంజిన్, విద్యుత్ వ్యవస్థ, హైడ్రాలిక్ సిస్టమ్ లేదా సాంకేతిక లోపాల వల్ల విమానం గాల్లోనే కంట్రోల్ కోల్పోవడం లేదా అత్యవసర ల్యాండింగ్ అవసరం కావచ్చు, లేదా విమానం ప్రమాదానికి గురికావచ్చు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా విమానం ప్రమాదాాలు జరుగుతాయి.

వాతావరణం:

విమానం టేకాఫ్ సమయంలో బలమైన గాలులు, తుఫానులు లేదా ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల కూడా విమానం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కూలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఈ సమయాల్లో పైలట్ తన విమానం వేగాన్ని మారుస్తారు.

Updated Date - Jun 12 , 2025 | 04:58 PM