PM Modi: అణ్వస్త్రాల బూచికి బెదరం: మోదీ
ABN , Publish Date - May 12 , 2025 | 08:39 PM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఇంత పెద్దఎత్తున భారత్ ప్రతిస్పందిస్తుందని టెర్రరిస్టులు సైతం ఊహించలేదని, మన క్షిపణలు, డ్రోన్లు పాక్ ఉగ్రశిబిరాల బీషణంగా గర్జించడంతో టెర్రరిస్టు స్థావరాలు నేలమట్టమయ్యాయని అన్నారు.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఇంత పెద్దఎత్తున భారత్ ప్రతిస్పందిస్తుందని టెర్రరిస్టులు సైతం ఊహించలేదని, మన క్షిపణలు, డ్రోన్లు పాక్ ఉగ్రశిబిరాల బీషణంగా గర్జించడంతో టెర్రరిస్టు స్థావరాలు నేలమట్టమయ్యాయని అన్నారు. పాకిస్తాన్ డ్రోన్లను కుప్పలుతెప్పలుగా కూల్చేయడం ద్వారా భారత్ మిలటరీ పవర్ ఏమిటో యావత్ ప్రపంచం చూసిందన్నారు. 'ఆపరేషన్ సింధూర్' సింధూర్ విజయాన్ని ఈ దేశ మహిళలకు అంకితమిస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తేజపూర్వక ప్రసంగం చేశారు.
Operation Sindoor: పాక్ న్యూక్లిరియర్ ఫెసిలిటీపై భారత్ దాడి చేసిందా?.. ఆర్మీ ఏం చెప్పిందంటే
ఆపరేషన్ సిందూర్‌లో బలగాలు ఎంతో ధైర్యం ప్రదర్శించాయని, మన సైన్యం తెగువకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ అన్నారు. పాక్ డ్రోన్లను గాలిలోనే సైన్యం కూల్చేసిందని, టెర్రరిస్టులను సమూలంగా మట్టుపెట్టేందుకు సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు. ''మన ఆడకూతుళ్ల నుదుట సిందూరం తుడిచిపెట్టిన వారు ఎలాంటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోంది ప్రతీ టెర్రరిస్టు, టెర్రరిస్టు సంస్థకు తెలిసొచ్చింది'' అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు కాదు, 140 కోట్ల భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక అని అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై గట్టి హెచ్చరిక చేశారు. అణ్వస్త్రాల బ్లాక్‌మెయిల్‌ను ఇండియా సహించేది లేదని, ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత ఆక్రమిత కశ్మీర్‌పైనే పాక్‌తో చర్చలుంటాయని మోదీ స్పష్టం చేశారు.