ICC Champions Trophy: పాక్‌లో విదేశీయుల కిడ్నా్‌పనకు ఉగ్ర యత్నాలు
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:30 AM
ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ఐఎ్‌సకేపీ) సంస్థ విదేశీ అతిథులను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదముందని వెల్లడించింది.
చాంపియన్స్ ట్రోఫీ వేళ పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే విదేశీ పర్యాటకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ఐఎ్‌సకేపీ) సంస్థ విదేశీ అతిథులను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదముందని వెల్లడించింది. ముఖ్యంగా చైనీయులు, అరబ్ జాతీయులను లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది. ఐఎ్‌సకేపీకి చెందిన వ్యక్తులు నగర శివార్లలో ఇళ్లను అద్దెకు తీసుకుని... సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో రిక్షా, బైకులు మాత్రమే వెళ్లే చోట విదేశీయుల కిడ్నా్‌పలకు ప్లాన్ చేస్తున్నారని పేర్కొంది. ఇటు అఫ్గనిస్థాన్ నిఘా విభాగం (జీడీఐ) కూడా ఐఎ్‌సకేపీ దాడులు తెగబడే ప్రమాదముందని అధికారులను అప్రమత్తం చేసింది.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.