Share News

Hanif Abbasi: మా 130 అణ్వస్త్రాలను మీకే గురిపెట్టాం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:14 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్ నాయకులు, సైన్యాధికారులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ వాణిజ్యాన్ని నిలిపివేయడం, విమానయాన నిషేధాలు, సైన్యాన్ని అప్రమత్తం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నది.

Hanif Abbasi: మా 130 అణ్వస్త్రాలను మీకే గురిపెట్టాం

మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు

సింధు నీళ్లను భారత్‌ ఆపేస్తే

పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే..

పాక్‌ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు

పాక్‌కు అండగా ఉంటాం: చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్నాయి. పాకిస్థాన్‌ నేతలు, సైన్యాధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. లండన్‌లోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న భారత సంతతి ప్రజలను ‘గొంతు కోసేస్తాం..’ అంటూ సంజ్ఞలతో పాక్‌ సైనికాధికారి హెచ్చరించిన మర్నాడే పాకిస్థాన్‌ రైల్వే మంత్రి హనీఫ్‌ అబ్బాసీ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌ సింధు నది నీటిని ఆపేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పాకిస్థాన్‌ వద్ద ఉన్న అణ్వాయుధాలు, క్షిపణులు ఏదో ప్రదర్శన కోసం కాదు. వాటిని దాడికి సిద్ధంగా దేశవ్యాప్తంగా రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచాం. పాకిస్థాన్‌ వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు భారత్‌ వైపే గురిపెట్టి ఉన్నాయి’’ అని అబ్బాసీ హెచ్చరించారు. ఘోరీ, షహీన్‌, ఘజ్నవీ వంటి క్షిపణులు, అణ్వాయుధాలు అన్నీ భారత్‌ కోసమే సిద్ధం చేశామన్నారు. పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్‌ తన భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌ విషయంలో చేపట్టిన చర్యల తీవ్ర పరిణామాలు ఏమిటో భారత్‌కు ఇప్పుడిప్పుడే తెలిసివస్తోందని.. అందుకే దాడికి వెనుకాడుతోందన్నారు.


పాకిస్థాన్‌ గగనతలం మీదుగా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించిన రెండు రోజులకే.. విమానయాన పరిశ్రమలో గగ్గోలు పుట్టిందని, మరో పది రోజులు ఇలాగే కొనసాగితే ఆ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతాయని చెప్పారు. ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని భారత్‌ నిలిపివేయడంపై స్పందిస్తూ... ఇలాంటి వాటిని ఎదుర్కొవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన చర్యలతో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. ఇప్పటికే వాణిజ్యం నిలిపివేతతో మొదలైన ఇబ్బందులను, యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దేశ త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది. సిబ్బంది సెలవులను రద్దు చేసింది. అన్ని రైల్వే స్టేషన్లను ఆర్మీ ఆధీనంలోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే... యుద్ధ ట్యాంకులు, మిలటరీ పరికరాలు, ఆయుధాలు, సైన్యానికి అవసరమైన సరుకులు వంటివాటిని అప్పటికప్పుడు, వేగంగా రవాణా చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్టు అబ్బాసీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఔషధాల కొరత ఏర్పడకుండా ఆ దేశం అత్యవసర చర్యలు చేపట్టింది. చైనా, రష్యా, ఇతర దేశాల నుంచి ఏపీఐలను దిగుమతి చేసుకునేందుకు పాక్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:38 AM