School Education: తెలంగాణ బడుల్లో తెలుగు ఇక నిక్కచ్చిగా అమలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:59 AM
విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని బోర్డుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది.

1 నుంచి 10 వరకు అన్ని సిలబ్‌సల స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని బోర్డుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది. విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్య లు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. విద్యార్థులకు సరళమైన విధానంలో బోధించడం, వారిలో అభిరుచిని పెంపొందించడానికి వీలు గా 9, 10 తరగతుల పాఠ్యాంశంగా ‘వెన్నెల’ అనే తెలుగు వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది. దీనివినియోగానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ పుస్తకం ఆధారంగా సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, ఐబీ బోర్డుల యాజమాన్యాలు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News