Delhi Airport: ఎయిర్ పోర్ట్‌లో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:51 AM
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ(ATC)లో టెక్నికల్ ప్రాబ్లెమ్ తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ వారి వారి విమానయాన సంస్థలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయని ఎయిర్‌పోర్ట్ అధికారిక వర్గాలు తెలిపాయి. విమానాల షెడ్యూల్ మార్పునకు సంబంధించి ఎయిర్‌లైన్లు ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిరిండియా ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాల ప్రయాణం ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులోని చెక్‌ఇన్, ఇతర కౌంటర్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని గంటల సమయంలోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా లఖ్‌నవూ, జైపుర్, చండీగఢ్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుల్లోనూ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. దేశంలోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా పేరుగాంచిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నిత్యం 1500లకు పైగా విమాన ప్రయాణాలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు...
Vande Mataram: వందేమాతర గీతానికి నేటికి 150 ఏళ్లు.. పులకిస్తోన్న భారతదేశం