Share News

Bengaluru: ఇద్దరు పిల్లలను హతమార్చి.. టెకీ దంపతుల ఆత్మహత్య

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:43 AM

బెంగళూరు సదాశివనగర్‌లో టెకీ దంపతులు తమ ఇద్దరు పిల్లలను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నారు.

Bengaluru: ఇద్దరు పిల్లలను హతమార్చి.. టెకీ దంపతుల ఆత్మహత్య

బెంగళూరు సదాశివనగర్‌లో దారుణం

కుమార్తె ఆరోగ్య సమస్యలతో వేదన?

బెంగళూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు సదాశివనగర్‌లో టెకీ దంపతులు తమ ఇద్దరు పిల్లలను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనూప్‌(38), ఆయన భార్య రాఖి(35), కూతురు అనుప్రియ(5), కుమారుడు ప్రియాంశ్‌(2)గా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనూప్‌ బెంగళూరులో ఓ కంపెనీకి సాఫ్ట్‌వేర్‌ కన్సల్‌టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పెద్దకూతురు అనుప్రియ అరోగ్య సమస్యతో దంపతులు ఒత్తిడికి, తీవ్ర ఆవేదనకు గుర య్యే వారని తెలుస్తోంది. వీరి ఇంట్లో ముగ్గురు పనివారు ఉన్నారు. ఇద్దరు వంటపని చేసేవారు కాగా ఒకరు ప్రియాంశ్‌ను చూసుకునేవారు. ఒక్కొక్కరికి రూ.15వేల దాకా జీతం ఇచ్చేవారు. సోమవారం ఉదయం పాండిచ్చేరి వెళుతున్నామని, తొందరగా పనికి రావాలని ఆదివారం సూచించారు. కుటుంబం ప్రయాణానికి ఆదివారం ప్యాకింగ్‌ పనులను కూడా పనివారు చేశారు. వీరు సోమవారం ఉదయం వచ్చేసరికి దంపతులు ఇద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. బిడ్డలిద్దరికీ విషం ఇచ్చి చంపినట్టు, ఆ తరువాత దంపతులు ఉరి వేసుకున్నట్టు భావిస్తున్నారు. అనూప్‌ కుటుంబం ఆర్థికంగా పటిష్టంగా ఉందని, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని సమాచారం.

Updated Date - Jan 07 , 2025 | 04:43 AM