Chairman Takes Responsibility: బంగారు పలకలకు మాదే బాధ్యత టీడీబీ చైర్మన్
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:40 AM
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం అవకతవకల కేసు విచారణలో పూర్తి సహకారం......
తిరువనంతపురం, అక్టోబరు 13: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం అవకతవకల కేసు విచారణలో పూర్తి సహకారం అందిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) చైర్మన్ పీఎస్ ప్రశాంత్ అన్నారు. బోర్డు పూర్తి నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరించిందని చెప్పారు. ప్రస్తుతం విగ్రహాల బంగారు పూత కోసం తీసుకున్న బంగారు పలకలకు బోర్డు పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బంగారు పలకలను తీసుకునేముందు అవసరమైన అన్ని ప్రమాణాలు పాటించినట్టు వెల్లడించారు. 1998 నుంచి ఏం జరిగిందనే దానిపై విచారణ చేయాలన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రిటైర్డ్ అయినా వదిలిపెట్టరాదని కోరారు. ప్రస్తుత బోర్డును అనుమానించడానికి ఎలాంటి కారణం లేదని, తగ్గిన బంగారాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. శబరిమల ఆలయంలో బంగారు తొడుగుల బరువులో 4.5 కిలోలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించిన కేరళ హైకోర్టు సిట్‌తో విచారణ చేయించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.