Share News

National Education Policy: 10వేల కోట్లిచ్చినా జాతీయ విద్యావిధానాన్ని ఒప్పుకోం

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:43 AM

ఈ కార్యక్రమంలో స్టాలిన్‌ జాతీయ విద్యావిధానంపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం అమలుకు చెల్లించాల్సిన రూ.2152 కోట్ల నిధులను అకారణంగా నిలిపేశారని,

National Education Policy: 10వేల కోట్లిచ్చినా జాతీయ విద్యావిధానాన్ని ఒప్పుకోం

తమిళనాడు సీఎం స్టాలిన్‌

చెన్నై, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యావిధానం అమలుకు అంగీకరిస్తేనే రూ.2వేల కోట్ల నిధులను విడుదల చేస్తామని కేంద్రప్రభుత్వం చెబుతోందని, కానీ, 10వేల కోట్లిచ్చినా ఆ విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలుపరిచే ప్రసక్తేలేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. శనివారం కడలూరు జిల్లాలో ‘తల్లిదండ్రులను గౌరవిద్దాం’ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్‌ జాతీయ విద్యావిధానంపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం అమలుకు చెల్లించాల్సిన రూ.2152 కోట్ల నిధులను అకారణంగా నిలిపేశారని, తద్వారా ఆ పథకంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు లేకుండా చేశారని కేంద్రాన్ని దుయ్యబట్టారు. జాతీయ విద్యావిధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనదన్నారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో హిందీభాషను నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్న ఆయన, ఆ భాషను నిర్బంధంగా అమలు చేయాలన్న ఆలోచననే దశాబ్దాల తరబడి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

Updated Date - Feb 23 , 2025 | 04:43 AM