Tamil Nadu: తమిళనాడులో ఇద్దరు మంత్రులు అవుట్
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:56 AM
తమిళనాడు రాష్ట్రంలోని రెండు మంత్రులు అవినీతి, అక్రమాల కారణంగా తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం స్టాలిన్ సూచన మేరకు సెంథిల్ బాలాజీ, పొన్ముడి రాజీనామా చేశారు. ఈ రాజీనామాల తర్వాత వారి శాఖలను ఇతర మంత్రులకు అప్పగించారు.
సెంథిల్ బాలాజీ, పొన్ముడి రాజీనామా
సీఎం స్టాలిన్ సిఫారసుకు గవర్నర్ ఆమోదం
క్యాబినెట్‌లోకి తంగరాజ్.. నేడు ప్రమాణం
చెన్నై, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో న్యాయస్థానాల మొట్టికాయలు తిన్న ఇద్దరు తమిళనాడు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి సెంథిల్ బాలాజీ, అటవీ మంత్రి కె.పొన్ముడి ఆదివారం తమ రాజీనామా లేఖలను సీఎం స్టాలిన్‌కు పంపించారు. వారి వ్యవహారం తన ప్రభుత్వానికి ఇబ్బందుల్లోకి నెట్టే సూచనలు కనిపిస్తుండడంతో పదవుల నుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రే వారిని ఆదేశించినట్లు సమాచారం. ఆయన సిఫారసుతో వారి రాజీనామాలను గవర్నర్ ఆర్‌ఎన్ రవి తక్షణమే ఆమోదించారు. డీఎంకే సీనియర్ నేత, పద్మనాభపురం ఎమ్మెల్యే మనో తంగరాజ్‌ను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆయన అంగీకరించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు తంగరాజ్‌తో గవర్నర్ ప్రమాణం చేయించనున్నట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. ఇంకోవైపు.. సెంథిల్ నిర్వహించిన విద్యుత్‌శాఖను రవాణా మంత్రి శివశంకర్‌కు.. ఎక్సైజ్‌శాఖను గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్.ముత్తుస్వామికి, పొన్ముడి అటవీశాఖను డెయిరీ శాఖ మంత్రి ఆర్‌ఎస్ రాజకన్నప్పన్‌కు అదనంగా అప్పగించారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News