Chennai: ప్రభుత్వ బడిలో న్యాయమూర్తి కుమార్తె
ABN , Publish Date - Jun 11 , 2025 | 10:22 AM
తమ బిడ్డల్ని ప్రైవే టు బడుల్లో.. అది కూడా ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలని పట్టుబట్టి మరీ పరుగులు తీస్తున్న ఈ యుగంలో మాతృభాషపై మమకారం కలిగిన ఓ న్యాయమూర్తి తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నిర్ణయించుకున్నారు.
- అది కూడా తమిళమాధ్యమం
- సర్వత్రా ప్రశంసల వర్షం
చెన్నై: తమ బిడ్డల్ని ప్రైవే టు బడుల్లో.. అది కూడా ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలని పట్టుబట్టి మరీ పరుగులు తీస్తున్న ఈ యుగంలో మాతృభాషపై మమకారం కలిగిన ఓ న్యాయమూర్తి తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నిర్ణయించుకున్నారు. వివరాలిలా... తెన్‌కాశి జిల్లా శంకరన్ కోవిల్ ప్రాంతానికి చెందిన విజయభారతి పుదుకోట జిల్లా సెషన్స్ జడ్జిగా కొన్నేళ్లు పనిచేశారు. ఇటీవల ఆయనకు శివకాశి కోర్టు బదిలీ అయ్యారు.
శివకాశి సెషన్స్ కోర్టు జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విజయభారతి తన ఏడేళ్ల కుమార్తె అన్బికినియాల్‌ను విశ్వనత్తం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో తమిళ మాధ్యమంలో రెండో తరగతిలో చేర్పించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనపాల్, ఉపాధ్యాయులు న్యాయమూర్తి విజయ భారతిని సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన కుమార్తెకు అడ్మిషన్ పత్రాన్ని టైప్ చేసి, నకలు అందజేశారు.
ఈ సందర్భంగా జడ్జి విజయభారతి(Vijayabharati) మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలతో పోటీపడేలా నాణ్యమైన విద్యనందిస్తున్నాయని, అందుకే తన కుమార్తెను సర్కారు బడిలో చేర్చించినట్లు తెలిపారు. తమిళ మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, తామంతా ఆ మాధ్యమం చదివే వచ్చామని ఆయన చెప్పారు. కాగా తన కుమార్తెను ప్రభుత్వ బడిలో చదివించాలని నిర్ణయించిన ఆ న్యాయమూర్తిని నెటిజట్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News