Share News

Sweet Shop Owner: త్వరగా పెళ్లి చేసుకుని స్వీట్లకు ఆర్డర్‌ ఇవ్వండి..

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:04 AM

రాహుల్‌ జీ మీరు దేశంలోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. త్వరగా పెళ్లి చేసుకోండి.. మీ వివాహానికి కావాల్సిన స్వీట్ల ఆర్డర్ల కోసం

Sweet Shop Owner: త్వరగా పెళ్లి చేసుకుని స్వీట్లకు ఆర్డర్‌ ఇవ్వండి..

  • రాహుల్‌ గాంధీకి స్వీట్‌ షాప్‌ యజమాని సూచన

న్యూఢిల్లీ, అక్టోబరు 21: ’’రాహుల్‌ జీ మీరు దేశంలోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. త్వరగా పెళ్లి చేసుకోండి.. మీ వివాహానికి కావాల్సిన స్వీట్ల ఆర్డర్ల కోసం మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’’. ఇది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి పాత ఢిల్లీలో ఎదురైన ఓ ఆసక్తికర అనుభవం. దీపావళి సందర్భంగా సుప్రసిద్ధ ఘంటేవాలా మిఠాయి దుకాణంలో సందడి చేసిన రాహుల్‌కు, ఆ షాపు యజమాని సుశాంత్‌ జైన్‌ నుంచి ఈ సరదా విజ్ఞప్తి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ అభ్యర్థనకు రాహుల్‌ గాంధీ చిరునవ్వుతో స్పందించడం వీడియోలో కనిపించింది. పండగ సందర్భంగా స్వీట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన రాహుల్‌ను, సుశాంత్‌ జైన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మిఠాయిలు తయారు చేయడంలో స్వయంగా చేతులు కలిపారు. తన తండ్రి రాజీవ్‌ గాంధీకి ఇష్టమైన ’ఇమర్తి’తో పాటు తనకు ఎంతో ఇష్టమైన ’బేసన్‌ లడ్డూ’లను తయారు చేసి వాటి రుచిని ఆస్వాదించారు.

Updated Date - Oct 22 , 2025 | 05:07 AM