Swaraj Kaushal: సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూత..
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:50 PM
సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం చనిపోయారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ దివంగత నేత సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు. తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కాగా, స్వరాజ్ కౌశల్ 1952 జులై 12వ తేదీన హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్‌లో జన్మించారు. 1990 నుంచి 1993 మధ్య కాలంలో ఆయన మిజోరం గవర్నర్‌గా పని చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. స్వరాజ్ కౌశల్ భార్య సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 ఆగస్టు 6వ తేదీన ఆమె చనిపోయారు.
ఇవి కూడా చదవండి
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం
రష్యాతో రెండు బిలియన్ డాలర్ల డీల్ కుదిరిందా.. నిజమెంత..