Share News

Votes Registered: ఒకే ఇంటి నంబర్‌ 43 ఓట్లు

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:26 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఓటర్‌ జాబితాలో ఓ ఇంటి నంబర్‌పై ఏకంగా 43 మంది ఓటర్లు ఉండటం చర్చనీయాంశమైంది......

 Votes Registered: ఒకే ఇంటి నంబర్‌ 43 ఓట్లు

  • సామాజిక మాధ్యమాల్లో జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితా ఫొటోలు వైరల్‌ విచారణకు జిల్లా ఎన్నికల

    అధికారి ఆదేశం

  • నేటి నుంచే నామినేషన్లు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ నేడే 21 దాకా నామినేషన్ల

    దాఖలుకు చాన్స్‌ 15న సునీత, 17న నవీన్‌ నామినేషన్లు

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఓటర్‌ జాబితాలో ఓ ఇంటి నంబర్‌పై ఏకంగా 43 మంది ఓటర్లు ఉండటం చర్చనీయాంశమైంది. యూసు్‌ఫగూడ డివిజన్‌ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంటి నంబర్‌పై 43 మంది పేర్లు నమోదు చేశారు. వీరిలో చాలా మంది 30-40 ఏళ్లలోపు వారే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఓటర్లు 3.85 లక్షలు ఉండగా.. ఇటీవల ప్రకటించిన తుది జాబితా మేరకు ఓటర్ల సంఖ్య 3.98 లక్షలకు పెరిగింది. తుది దశ పరిశీలనలోని దరఖాస్తుల సంఖ్య కలిపితే ఓటర్ల సంఖ్య 4 లక్షలు దాటుతుందని అధికారులు చెబుతున్నారు. అయుతే ఒకే ఇంటి నంబర్‌పై 43 మంది ఓటర్లున్న ఓటర్‌ జాబితా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై దృష్టి సారించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌.. ఎన్నికల విభాగం అధికారులను విచారణకు ఆదేశించారు. దీంతో ఆ చిరునామాలో అపార్ట్‌మెంట్‌ ఉందా..? ఇండిపెండెంట్‌ నివాసమా..? ఎన్ని కుటుంబాలున్నాయి..? జాబితాలో పేరున్న వాళ్లు అక్కడుంటున్నారా.. లేదా..? అన్నది అధికారులు పరిశీలించనున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 04:26 AM