Share News

Former Maoist leader Ashanna: ముందు మనల్ని మనం కాపాడుకోవాలి ఆశన్న

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:49 AM

సాయుధ పోరు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఆయుధాలు అప్పగించి ప్రాణాలు కాపాడుకోవాలని....

Former Maoist leader Ashanna: ముందు మనల్ని మనం కాపాడుకోవాలి ఆశన్న

  • లొంగిపోవాలని ఇతర మావోయిస్టులకు పిలుపు

  • 62671 38163 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని సూచన

జగదల్‌పూర్‌, అక్టోబరు 16: సాయుధ పోరు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఆయుధాలు అప్పగించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ పార్టీ అగ్రనేత ఆశన్న పిలుపునిచ్చారు. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులు తనను సంప్రదించవచ్చంటూ తన ఫోన్‌ నంబరును వెల్లడించారు. ప్రభుత్వానికి లొంగిపోయేందుకు వెళుతున్న సమయంలో గురువారం జగదల్‌పూర్‌లో మీ డియా ప్రతినిధులతో ఆశన్న మాట్లాడారు. ‘‘సాయు ధ పోరు చేస్తున్న సహచరులారా.. నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి రావడం కొందరికి అభ్యంతరకరంగా ఉంది. అయితే, ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీరు కూడా ఆలోచించాలి. మీ భద్రతపై ఆందోళనగా ఉంది. ముందుగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించుకోవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నన్ను సంప్రదించేందుకు నా నంబరు ఇస్తున్నా. మీ ఆలోచనలు చెప్పవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తన ఫోన్‌ నంబరును 62671 38163గా తెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 04:49 AM