Share News

Supreme Court: ఈవీఎంలలో డాటా తొలగించవద్దు ఎన్నికల కమిషన్‌కు సుప్రీం ఆదేశం

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:19 AM

ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంల నుంచి డాటాను తొలగించడానికి అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ పద్ధతి ఏమిటో తెలపాలని కూడా నిర్దేశించింది. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి కోరితే... ట్యాంపరింగ్‌ జరగలేదని వివరణ ఇవ్వగలిగేలా ఉండాలని పేర్కొంది.

Supreme Court: ఈవీఎంలలో డాటా తొలగించవద్దు ఎన్నికల కమిషన్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో డాటాను తొలగించడం లేదా జోడించడం చేయవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంల నుంచి డాటాను తొలగించడానికి అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ పద్ధతి ఏమిటో తెలపాలని కూడా నిర్దేశించింది. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి కోరితే... ట్యాంపరింగ్‌ జరగలేదని వివరణ ఇవ్వగలిగేలా ఉండాలని పేర్కొంది. ఏడీఆర్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి డాటాను తొలగించవద్దని ఈసీని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.

Updated Date - Feb 12 , 2025 | 05:19 AM