Supreme Court: తెలంగాణకు సుప్రీంకోర్టు రూ.5 వేల జరిమానా
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:34 AM
ఒక్కో రాష్ట్రానికి రూ.5 వేలు జరిమానా విధించింది. పోష్ చట్టం అమలుపై గోవాకు చెందిన ఔరేలియానో ఫెర్నాండెజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నివేదిక సమర్పణలో జాప్యానికి చర్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్రం 2013లో తీసుకొచ్చిన పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరా్‌సమెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్) చట్టం అమలుకు సంబంధించి నివేదికను సమర్పించడంలో నిర్లక్ష్యం వహించినందుకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో రాష్ట్రానికి రూ.5 వేలు జరిమానా విధించింది. పోష్ చట్టం అమలుపై గోవాకు చెందిన ఔరేలియానో ఫెర్నాండెజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర వివరాలను ఫిబ్రవరి 11లోపు సమర్పించాలని గత డిసెంబరు నెలలో ఆదేశించింది. అయితే తెలంగాణతోపాటు మణిపూర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆ ఆదేశాలను పాటించలేదు. దీంతో ఒక్కో రాష్ట్రానికి రూ.5 వేలు జరిమానా విధించింది. రెండు వారాల్లో జరిమానా చెల్లించాలని, మూడు వారాల్లో అపిఢవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.