Supreme Court: వనతారపై సుప్రీం సిట్
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:54 AM
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం గుజరాత్‌లోని వనతారలో నిర్వహిస్తున్న జంతు సంరక్షణ, పునరావాస కేంద్రంపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందా న్ని...
మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటు
ఏనుగుల సంరక్షణలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు
న్యూఢిల్లీ, ఆగస్టు 26: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం గుజరాత్‌లోని వనతారలో నిర్వహిస్తున్న జంతు సంరక్షణ, పునరావాస కేంద్రంపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందా న్ని (సిట్) సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు ‘సిట్’ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై రిటైర్డు పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే, కస్టమ్స్ శాఖ అడిషనల్ కమిషనర్ అనీశ్ గుప్తా ఈ బృందంలో ఇతర సభ్యులు. సెప్టెంబరు 12వ తేదీనాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని ‘సిట్’ను కోర్టు ఆదేశించింది. చట్టపరమైన అనుమతులు లేకుండా ఏనుగులను దేశంలోని ఇతర ప్రాంతాలనుంచీ, విదేశాలనుంచీ ’వనతార‘ సేకరిస్తున్నదంటూ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలను ఆధారం చేసుకుని రెండు పిటిషన్లు ఈ నెల 14న సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News