Supreme Court: హిందూ వారసత్వ చట్టం ఎస్టీలకు వర్తించదు
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:53 AM
హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు వర్తించదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
హిమాచల్ గిరిజనుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు వర్తించదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో కుమార్తెలు గిరిజన ఆచారాల ప్రకారం కాకుండా హిందూ వారసత్వ చట్టం (హెచ్‌ఎ్‌సఏ) ప్రకారం ఆస్తిని పొందేందుకు అనర్హులని స్పష్టం చేసింది. హెచ్‌ఎ్‌సఏ ప్రకారం గిరిజనులు ఆస్తిని పొందేందుకు అర్హులేనంటూ హిమాచల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. హెచ్‌ఎ్‌సఏలోని సెక్షన్ 2(2)కి హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 336లో నిబంధన(25) ప్రకారం ఏ షెడ్యూల్డ్ తెగ సభ్యులకూ హెచ్‌ఎ్‌సఏ వర్తించదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, హెచ్‌ఎ్‌సఏను ఎస్టీలకు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే కేంద్రానికి సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది.